Telugudesam: టీడీపీ నేత సాధినేని యామినికి సోషల్ మీడియాలో వేధింపులు.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • పవన్ పై విమర్ళలతో వెలుగులోకి వచ్చిన యామిని
  • ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టిన నెల్లూరు యువకుడు
  • అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకొచ్చిన పోలీసులు

ఇటీవల ‘ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మల్లెపూలు నలపడం తప్ప మరేమీ చేయలేరు’ అంటూ టీడీపీ నేత సాధినేని యామిని వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ టీవీ షోలో జనసేన నేత దిలీప్ సుంకర, యామినిల మధ్య దూషణలు హద్దులు దాటడంతో ఆమె కన్నీరు పెట్టుకుంటూ షో నుంచి వాకౌట్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో యామినిని దూషిస్తూ అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన నెల్లూరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నెల్లూరు పట్టణానికి చెందిన గంగినేని శ్రావణ్ కుమార్ ను గుంటూరు జిల్లా పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. కాగా, ఓ టీవీ ఛానల్ లో జరిగిన కార్యక్రమంలో తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత దిలీప్ సుంకరపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని యామిని అప్పట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telugudesam
leader
sadineni yamini
Andhra Pradesh
Nellore District
Guntur District
harrasment
Social Media
Police
arrested
Pawan Kalyan
  • Loading...

More Telugu News