kcr: ఆ వ్యాఖ్యలతో కేసీఆర్ పరిస్థితి అర్థమవుతోంది: ఏపీ మంత్రి గంటా

  • ఎన్నికల్లో ఓడిపోతామని కేసీఆర్ భయపడుతున్నారు
  • రెండు రాష్ట్రాల కోసం చంద్రబాబు పాటుపడతారు
  • టీఆర్ఎస్ ఓటమి ఖాయం

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలే అందుకు అద్దంపడుతున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రాజకీయాలు చేస్తా, ఓడిపోతే ఫామ్ హౌస్ లో ఉంటానన్న కేసీఆర్ మాటల ద్వారా పరిస్థితి అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం కేసీఆర్ మాటల్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాల కోసం పాటుపడతానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంగా చెప్పిన విషయాన్ని గంటా ప్రస్తావించారు. ఈ సందర్భంగా వైసీపీ, జనసేన పార్టీల అధినేతలపై విమర్శలు గుప్పించారు.

kcr
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News