rajani: తెరపై అద్భుతమైన మరో ప్రపంచాన్ని చూశాను: '2.ఓ' గురించి అనిరుధ్

- శంకర్ మాస్టర్ డైరెక్టర్
- నటన పరంగా విశ్వరూపం చూపించారు
- శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది
ఇటు రజనీ .. అటు అక్షయ్ అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ '2.ఓ' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. '2.ఓ' సినిమా చూసిన సినీ ప్రముఖులు తమదైన శైలిలో టీమ్ ను అభినందిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా ఈ సినిమా చూసి స్పందించాడు. "ఈ సినిమాను చూస్తున్నంత సేపు తెరపై మరో అద్భుతమైన ప్రపంచాన్ని చూసిన అనుభూతి కలిగింది. మళ్లీ .. మళ్లీ చూడాలనిపించేంత గొప్పగా ఈ సినిమా వుంది.
