Andhra Pradesh: ప్రబోధానంద స్వామి నా భర్తే.. 28 ఏళ్ల క్రితం నన్ను పుట్టింట్లో వదిలి పారిపోయాడు!: రంగమ్మ

  • మా ఇద్దరికి 1977లో వివాహం అయింది
  • ఆయన అసలు పేరు పెద్దన్న
  • అనంతపురం కోర్టును ఆశ్రయించిన రంగమ్మ

అనంతపురం జిల్లాలోని పెద్దపొలమడలో ఉన్న ప్రబోధానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రబోధానంద తన భర్త అనీ, 13 సంవత్సరాలు కాపురం చేశాక పుట్టింట్లో వదిలి పారిపోయాడని రంగమ్మ అనే మహిళ అనంతపురం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తామిద్దరికీ 1977లో వివాహం అయిందని ఆమె వెల్లడించారు.

ప్రబోధానంద అసలు పేరు పెద్దన్న అనీ, ఇంటి నుంచి పారిపోయాక పేరును మార్చుకుని ప్రబోధానంద స్వామిగా ఆశ్రమం మొదలుపెట్టారని ఆరోపించారు. ఇటీవల పెద్దపొలమడలో గొడవల నేపథ్యంలో ఆయన ఫొటోను టీవీలో చూసి గుర్తు పట్టినట్లు రంగమ్మ పేర్కొన్నారు. దీంతో తన భర్తను కలవడానికి వెళ్లగా, ప్రబోధానంద వర్గీయులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తనకు ప్రబోధానంద నుంచి నెలవారి జీవన భృతి చెల్లించేలా ఆదేశించాలని తన లాయర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తాను గత 28 ఏళ్లుగా కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాననీ, ఇప్పుడు శరీరం సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Anantapur District
prabodhananda swamy
husband
court
28 years
fled
from home
  • Loading...

More Telugu News