Hyderabad: 'నీ భార్య న్యూడ్ ఫోటోలు ఉన్నాయి' అంటూ బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి... ఈ ఉదయం హైదరాబాద్ శివార్లలో హత్య!

  • బీఎన్ రెడ్డి నగర్ లో హత్య
  • మృతుడు కల్వకుర్తి వాసి
  • గతంలో బెదిరింపుల కేసు

హైదరాబాద్ శివార్లలోని బీఎన్ రెడ్డి నగర్ లో ఈ ఉదయం జరిగిన ఓ హత్య తీవ్ర కలకలం రేపింది. రహదారికి పక్కనే ఓ మృతదేహం పడివుండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కల్వకుర్తికి చెందిన శ్రీనివాసగౌడ్ గా గుర్తించిన పోలీసులు, ఇతనిపై గతంలోనే పోలీసులు కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ఓ వ్యక్తి భార్య నగ్న చిత్రాలు ఉన్నాయని రెండు నెలల క్రితం శ్రీనివాసగౌడ్ బ్లాక్ మెయిల్ చేశాడని, డబ్బివ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్టు కేసు రిజిస్టర్ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస గౌడ్ హత్యకు ఆ బ్లాక్ మెయిల్ ఉదంతానికి సంబంధం ఏమైనా ఉందా? లేక మరే ఇతర కారణాల వల్ల ఇంకెవరైనా హత్య చేసి వుండవచ్చా? అన్న కోణంలో దర్యాఫ్తు ప్రారంభించామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News