PSLV C-43: పీఎస్ఎల్వీ - సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతం
- శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-43 ప్రయోగం
- మొత్తం 31 శాటిలైట్లు నింగిలోకి
- ఇండియా సహా 8 దేశాల ఉపగ్రహాలు కక్ష్యలోకి
ఈ ఉదయం 9.57కు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ - సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇండియాకు చెందిన శాటిలైట్ తో పాటు మొత్తం 8 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలను ఈ వాహకనౌక కక్ష్యలోకి చేర్చనుంది. భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేసేలా, ఐదేళ్ల పాటు పని చేసే 380 కిలోల శాటిలైట్ 'హైసిస్'ను ఇది కక్ష్యలోకి చేరుస్తుంది. పీఎస్ఎల్సీ సిరీస్ లో ఇది 45వ ప్రయోగం. నింగిలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించిన పీఎస్ఎల్వీ - సీ 43 వాహక నౌక, ఆపై 18 నిమిషాల తరువాత నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది.