Nizamabad District: నరసింహస్వామి గుడిలో.. టీఆర్ఎస్ విజయంపై 'అల్లుబండ'ను జోస్యమడిగిన ఎంపీ కవిత!

  • నిజామాబాద్ జిల్లా జానకంపేటకు వచ్చిన కవిత
  • అల్లుబండపై నాణాన్ని నిలబెడుతూ ప్రశ్నలు
  • ఆపై విజయం తమదేనన్న ధీమా

ఎన్నికల్లో విజయంపై నరసింహస్వామివారి ముందు ప్రశ్నను అడిగిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, విజయం తమదేనన్న ధీమాను వ్యక్తం చేశారు. జిల్లాలోని ఎడపల్లి జానకంపేట గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన ఆమె, కోరిక తీరుతుందా? లేదా? అని జోస్యం చెప్పే అల్లుబండపై నాణాన్ని నిలిపారు.

ఈ బండపై నాణెం నిలబడితే కోరిక తీరుతుందని, నిలబడకుంటే కోరిక తీరదని భక్తుల విశ్వాసం. గతంలో ఇదే గుడికి వచ్చిన ఆమె, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, ఆపై ఎన్నికల్లో గెలుపు వంటి అంశాల్లో ప్రశ్నలు అడుగుతూ నాణాలను నిలబెట్టారు. ఇప్పుడామె మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆపై జానకంపేట చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె, ఈ ఎన్నికల్లోనూ స్వామి ఆశీస్సులతో విజయం సాధిస్తామని అన్నారు. 

Nizamabad District
Allubanda
K Kavitha
  • Loading...

More Telugu News