YSRCP: తిత్లీ తుపాను పరిహారం టీడీపీ కార్యకర్తలకే: వైఎస్ జగన్‌

  • తిత్లీ తుపాను సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలం
  • వైఎస్ హయాంలోనే వంశధార ప్రాజెక్టు పనులు
  • రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు

తిత్లీ తుపాను పరిహారం విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుపాను సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించిన జగన్.. పరిహారం మొత్తాన్ని టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వంశధార ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు.

తోటపల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వారి వడ్డీలకు కూడా సరిపోవడం లేదని విమర్శించారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర బుధవారం శ్రీకాకుళంలో సాగిన నేపథ్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ ఈ ఆరోపణలు చేశారు.

YSRCP
Jagan
Srikakulam District
Titly cyclone
Chandrababu
  • Loading...

More Telugu News