Amith shah: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారు: అమిత్ షా

  • సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు
  • దళితుడిని సీఎంని చేస్తానని మాట తప్పారు
  • తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తాం

ప్రజా సంక్షేమం కోసం నరేంద్రమోదీ చేపట్టిన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ఎంఐఎంకు భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించలేదని.. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతిఏటా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దళితుడిని సీఎంని చేస్తానన్న కేసీఆర్ రాష్ట్రం వచ్చాక మాట తప్పారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆ పని చేస్తారా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ.రెండున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని అమిత్ షా విమర్శించారు.

Amith shah
KCR
MIM
TRS
BJP
Adilabad District
  • Loading...

More Telugu News