kodangal: కొడంగల్ లో ఐటీ సోదాలు.. భారీగా బయటపడ్డ నగదు

  • జగన్నాథరెడ్డి ఫాంహౌస్ లో పట్టుబడిన నగదు
  • టీఆర్ఎస్ అభ్యర్థికి సమీప బంధువు జగన్నాథరెడ్డి
  • ధ్రువీకరించిన రజత్ కుమార్

రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువుగా భావిస్తున్న జగన్నాథరెడ్డి ఫాంహౌస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా ఈ మొత్తం బయటపడింది. నగదు బయటపడిన వార్తలు వాస్తవమేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటన కొడంగల్ లో కలకలం రేపుతోంది. అయితే, ఎంత మొత్తం పట్టుబడిందన్న విషయం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News