Realme U1: భారత్ లో విడుదలైన 'రియల్ మీ యూ1'.. 5 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించిన ఎస్బీఐ!
- వచ్చే నెల 5 నుండి అమెజాన్ లో విక్రయం
- రెండు వేరియంట్ లలో లభ్యం
- జియో వినియోగదారుల కోసం 4.2 టీబీ అదనపు డేటా
ఒప్పో సబ్ బ్రాండ్ సంస్థ అయిన 'రియల్ మీ' నుండి తాజాగా నూతన స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. గత సెప్టెంబర్ లో విడుదల చేసిన రియల్ మీ 2ప్రో, రియల్ మీ సీ1 స్మార్ట్ ఫోన్లకి కొనసాగింపుగా తాజాగా 'రియల్ మీ యూ1' ఫోన్ ని విడుదల చేశారు. భారీ డిస్ప్లే , 3/4 జీబీ ర్యామ్, డ్యూయల్ కెమెరాలాంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ను వచ్చే నెల 5 నుండి అమెజాన్ లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు.
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.11,999 ఉండగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.14,499గా ఉంది. బ్రేవ్ బ్లూ, యాంబిషియస్ బ్లాక్, ఫెయిరీ గోల్డ్ కలర్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ పై ఎస్బీఐ 5% క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అలాగే, జియో తన వినియోగదారుల కోసం 4.2 టీబీ అదనపు డేటాను ఉచితంగా ఇవ్వనుంది.
'రియల్ మీ యూ1' ప్రత్యేకతలు:
- 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2350 x 1080 పిక్సల్స్)
- మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్
- 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- 13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
- 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
Introducing #IndiasSelfiePro #RealmeU1 with:
— Realme (@realmemobiles) November 28, 2018
- AI 25MP Camera
- World’s 1st Helio P70 Processor
- 6.3” FHD+ Dewdrop Notch Screen
Available in:
3+32GB at INR 11,999
4+64GB at INR 14,499
Sale starts at 12:00 PM, 5th Dec on @amazonINhttps://t.co/reg8WhCGEN pic.twitter.com/d6MV9gv2RV