nivinpauli: 50 రోజులు .. 100 కోట్లు .. మలయాళ యంగ్ హీరో ఘనత

  • 45 కోట్ల బడ్జెట్ తో నివిన్ పౌలి చిత్రం 
  • కథానాయికగా ప్రియా ఆనంద్ 
  • కీలకపాత్రలో మోహన్ లాల్   

మలయాళ యువ కథానాయకులలో నివిన్ పౌలికి ప్రత్యేకమైన స్థానం వుంది. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో ఆయన ముందుంటాడు. 'నేరం'.. 'ప్రేమమ్'.. 'బెంగుళూర్ డేస్' వంటి చిత్రాలు ఆయన నటనలోని వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తాయి. అలాంటి నివిన్ పౌలి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కాయమ్ కులమ్ కొచ్చున్ని' హిట్ టాక్ తెచ్చుకుంది.

45 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇంతవరకూ మలయాళంలో ఈ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. అక్టోబర్ 11వ తేదీన విడుదలైన ఈ సినిమా రేపటితో 50 రోజులను పూర్తిచేసుకోనుంది. ఇంతవరకూ ఈ సినిమా 100 కోట్లకు పైగా రాబట్టింది. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రను పోషించడం విశేషం.  

nivinpauli
mohanlal
priya anand
  • Loading...

More Telugu News