New Delhi: పోలీసుల చేతిలోని బ్రీత్ అనలైజర్ ను లాక్కుని లండన్ చెక్కేసిన ఢిల్లీ మందుబాబు!

  • న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో తనిఖీలు
  • పూటుగా తాగివచ్చి బ్రీత్ అనలైజర్ దొంగతనం
  • ఆపై గంటల వ్యవధిలో లండన్ కు ప్రయాణం

ఢిల్లీలో ఓ మందుబాబు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసు చేతిలోని బ్రీత్ అనలైజర్ మెషీన్ ను లాక్కుని పారిపోవడంతో పాటు, లండన్ చెక్కేశాడు. ఈ వింత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తున్న వేళ, రాత్రి 11.40 గంటల సమయంలో ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగి, కారు నడుపుకుంటూ వచ్చాడు.

అతన్ని ఆపి తనిఖీ చేయబోగా, పోలీసు చేతిలోని బ్రీత్ అనలైజర్ ను లాక్కుని తన వాహనాన్ని వేగంగా పోనిచ్చాడు. పారిపోయిన ఆ వ్యక్తి నోయిడాకు చెందిన రిషీ థింగ్రా అని, ఆపై గంటల వ్యవధిలోనే ఆయన లండన్ వెళ్లాడని పోలీసులు తేల్చారు. తాగి కారు నడపడం, పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కల్పించడం వంటి నేరాల కింద అతనిపై కేసు నమోదు చేశామని, లండన్ నుంచి రాగానే అరెస్ట్ చేసి, విచారిస్తామని పోలీసులు తెలిపారు.

New Delhi
Police
Drunk Driving
Breath Analiser
London
  • Loading...

More Telugu News