Nandamuri Suhasini: సుహాసినికి ప్రచారం కోసం నేను వెళ్లడం లేదు: నారా భువనేశ్వరి

  • కొన్ని కారణాల వల్ల వెళ్లడం లేదు
  • అయినా నా మేనకోడలు గెలిచి తీరుతుంది
  • ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భువనేశ్వరి

కూకట్ పల్లిలో ప్రజా కూటమి తరఫున బరిలో ఉన్న తన మేనకోడలు నందమూరి సుహాసినికి మద్దతుగా తాను ప్రచారం చేయబోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, కొన్ని కారణాల వల్ల తాను ప్రచారానికి వెళ్లలేకపోతున్నానని, అయినప్పటికీ ప్రజల మద్దతు పుష్కలంగా ఉన్న సుహాసిని విజయం సాధించి తీరుతుందని అన్నారు. సుహాసినికి మద్దతుగా అసంఖ్యాక తెలుగుదేశం కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని, తమ కుటుంబం నుంచి కూడా ఎంతో మంది క్షేత్రస్థాయిలో ఉన్నారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి సాయం చేస్తున్నామని తెలిపారు.

Nandamuri Suhasini
Nara Bhuvaneshwari
NTR Trust Bhavan
Kukatpalli
  • Loading...

More Telugu News