mamatha benarjee: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో బీజేపీకి ఓటమి తప్పదు : బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

  • బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటా ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత
  • రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుంది
  • తృణమూల్‌ ఓటు బ్యాంకును చీల్చడం ఎవరి తరమూ కాదు

బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటా ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌ ఎన్నికలలో ఆ పార్టీకి ఓటమి తప్పదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీని ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలపై తప్పక కనిపిస్తుందని చెప్పారు. బెంగాల్‌లో జరిగే ఓ సమావేశంలో ఆమె మాట్లాడారు.

బెంగాల్‌లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, తృణమూల్‌ ఓటు బ్యాంకును చీల్చడం ఎవరి తరమూ కాదన్నారు. మావోయిస్టుల సమస్యతో ఒకప్పుడు బెంగాల్‌ ఎంతో ఇబ్బంది పడిందని, అటువంటి సమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లో ఆ సమస్య ఇంకా కొనసాగుతుండడం అక్కడి పాలకుల తీరుకు నిదర్శమని చెప్పారు.

mamatha benarjee
West Bengal
BJP
  • Loading...

More Telugu News