Jana Sena: మా పేరు చెప్పుకుని ప్రచారం చేస్తే నమ్మవద్దు : జనసేన ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి

  • ముందస్తు ఎన్నికల్లో మేమెవరికీ మద్దతు ఇవ్వడం లేదు
  • మా మద్దతు ఉందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు
  • పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే మా అధినేత స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో జనసేన పార్టీ తమకు మద్దతు ఇస్తోందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి నరాల సత్యనారాయణ స్పష్టం చేశారు. బోనకల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 7వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఇప్పటికే పార్టీ అధినేత స్పష్టం చేశారని, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్న విషయాన్ని గుర్తుచేశారు. కొందరు తమ స్వార్థం కోసం జనసేన మద్దతు ఉందని చెప్పుకుంటే తమకు సంబంధం లేదని, వాటిని నమ్మవద్దన్నారు.

Jana Sena
Khammam District
narala satyanarayana
  • Loading...

More Telugu News