Madhya Pradesh: మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2010b603bf5ed068fe1e8e4f77e27ed69c35279b.jpeg)
- మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు
- మిజోరంలో 40 స్థానాలు
- ఓట్లు వేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు
వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన మధ్యప్రదేశ్ తో పాటు మిజోరం పోలింగ్ ఈ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ స్థానాలకు, మిజోరంలోని 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మధ్యప్రదేశ్ లో మొత్తం 2,899 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని, మిజోరంలో 209 మంది గెలుపు ఓటములను ఓటర్లు నేడు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యప్రదేశ్ లో పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిజోరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకుంటున్నారు.