Baba Ramdev: అయోధ్య సమస్య పరిష్కారానికి అదొక్కటే మార్గం: బాబా రాందేవ్

  • బీజేపీ తీరును తప్పుబట్టిన బాబా రాందేవ్
  • రెండు చోట్లా అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన
  • ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్

అయోధ్యలో రామ మందిర నిర్మాణం విషయంలో జరుగుతున్న తాత్సారాన్ని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ తప్పుబట్టారు. అటు కేంద్రంలోనూ,  ఇటు ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించలేకపోతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ప్రజలు భావించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కోర్టు కేసుల కారణంగా మందిర నిర్మాణానికి కరసేవకులు ముందుకు రాలేకపోతున్నారన్నారు. కాబట్టి మందిర నిర్మాణానికి ఉన్న ఏకైక పరిష్కారం ఆర్డినెన్స్ తీసుకురావడమేనని తేల్చి చెప్పారు. ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా మందిర నిర్మాణాన్ని చేపట్టాలని బాబా రాందేవ్ కోరారు.

Baba Ramdev
BJP
UP
Narendra Modi
Ayodhya
Ram Mandir
  • Loading...

More Telugu News