KTR: కెమెరామన్ మృతి బాధాకరమే.. దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్!

  • ఆసుపత్రి సిబ్బందిపై నాగ్ అశ్విన్ ఆవేదన
  • తన స్నేహితుడు చనిపోయాడంటూ కేటీఆర్‌కు ట్వీట్
  • సానుభూతి వ్యక్తం చేసిన కేటీఆర్

దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. కెమెరామన్ మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇది ఎంతో బాధాకరమైన విషయమని, అతడి కుటుంబానికి, మిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తన స్నేహితుడైన కెమెరామన్‌ను గాంధీ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ ఎవరూ పట్టించుకోలేదని, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మూడు గంటలపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి చివరికి ప్రాణాలు వదిలాడని పేర్కొంటూ కేసీఆర్‌కు నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అతడు మరణించాడని, అతడో మంచి కెమెరామన్ అనిపేర్కొన్నాడు. మన ఆసుపత్రుల దుస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.  

నాగ్ అశ్విన్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. ఇది చాలా బాధాకరమైన విషయమని, అయితే, ఆసుపత్రికి తీసుకొచ్చే సరికే అతడి పరిస్థితి విషమంగా ఉందని సిబ్బంది తనతో చెప్పారని కేటీఆర్ పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ మన ఆసుపత్రుల్లో ఎన్నో మార్పులు చేయాల్సి ఉందని, ఇకపై దీనికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.  మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

KTR
Hyderabad
Gandhi hospital
Nag Ashwin
Camera man
Twitter
  • Loading...

More Telugu News