Chandrababu: చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టిన తుమ్మల నాగేశ్వరరావు

  • తెలంగాణపై చంద్రబాబు కుట్ర పన్నారు
  • పోలవరం పరిధిలో లేని గ్రామాలను కూడా లాక్కున్నారు
  • కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖలకు రాహుల్ వద్ద సమాధానం ఉందా?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు విమర్శల దాడిని ముమ్మరం చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

తెలంగాణపై చంద్రబాబు కుట్ర పన్నారని... పోలవరం పరిధిలో లేని గ్రామాలను కూడా ఆయన లాక్కున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుపై కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖలకు రాహుల్ వద్ద సమాధానం ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ తో జత కట్టారని... రాజకీయ మనుగడ కోసమే పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

Chandrababu
Rahul Gandhi
tummala nageswar rao
khammam
TRS
congress
Telugudesam
  • Loading...

More Telugu News