satyapal malik: కేంద్ర ప్రభుత్వం నాపై ఒత్తిడి తీసుకొచ్చింది: బాంబు పేల్చిన జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

  • సజ్జద్ లోన్ ను సీఎంగా నియమించాలని ఒత్తిడి వచ్చింది
  • అదే చేసి ఉంటే.. నిజాయతీ లేని వ్యక్తిగా నిలవాల్సి వచ్చేది
  • నాపై వస్తున్న విమర్శలకు బాధపడను

జమ్ముకశ్మీర్ అసెంబ్లీని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఉన్నపళంగా రద్దు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఆయన మరోసారి ప్రకంపనలు పుట్టించారు. తాను అసెంబ్లీని రద్దు చేసే ముందు సజ్జాద్ లోన్ ను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ తనపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన విషయం నిజమేనని ఆయన అన్నారు. కేంద్ర ఒత్తిడికి తాను లొంగి ఉంటే... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సజ్జాద్ ను తాను ఆహ్వానించాల్సి వచ్చేదని చెప్పారు. అదే చేసి ఉంటే... నిజాయతీ లేని వ్యక్తిగా తాను చరిత్రలో నిలబడాల్సి వచ్చేదని అన్నారు. తనపై వస్తున్న విమర్శలపై తాను బాధపడటం లేదని చెప్పారు.

satyapal malik
Jammu And Kashmir
governor
bjp
  • Loading...

More Telugu News