Bhadradri Kothagudem District: కారులో డబ్బు తరలింపు... ఇల్లెందులో పట్టేసిన పోలీసులు!

  • ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులు
  • ఇల్లెందు సమీపంలో కారులో దొరికిన డబ్బు
  • సీజ్ చేసిన పోలీసులు

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ, అక్రమంగా నగదు తరలింపును అడ్డుకునే దిశగా, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు జరుపుతుండగా, భారీ ఎత్తున డబ్బు పట్టుబడుతోంది. తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు సమీపంలోని సుభాశ్ నగర్ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా రూ. 11 లక్షలు పట్టుబడ్డాయి.

 ఓ కారులో ఇద్దరు వ్యక్తలు రాగా, వారిని ఆపిన పోలీసులు తనిఖీ చేయగా, ఈ డబ్బు పట్టుబడింది. ఓ బ్యాగులో సరైన పత్రాలు లేకుండా ఈ డబ్బును తీసుకువెళుతున్నారని గుర్తించిన అధికారులు, ఆ డబ్బును సీజ్ చేసి, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Bhadradri Kothagudem District
Illendu
Cash
Telangana
Elections
  • Loading...

More Telugu News