rajanikanth: శంకర్ నా దగ్గర ఎప్పుడూ టెన్షన్ పడలేదు: రజనీకాంత్

  • శంకర్ చాలా కష్టపడ్డారు
  • అనుకున్న అవుట్ పుట్ రాబట్టారు
  • తగిన ఫలితం దక్కుతుంది         

రజనీ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన '2.ఓ' ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం శంకర్ చాలా కష్టపడ్డారు. 'రోబో' సినిమా అప్పటికీ .. ఇప్పటికీ ఒక దర్శకుడిగా ఆయనలో మరింత పరిపక్వత చూశాను. విదేశీ సాంకేతిక నిపుణుల నుంచి తనకి కావలసిన అవుట్ పుట్ రాబట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు.

ప్లానింగ్ పరంగా ఆయన నా దగ్గర ఎప్పుడూ టెన్షన్ పడలేదు. ఆయన టెన్షన్ పడటం నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తాను అనుకున్న విధంగా వీఎఫ్ఎక్స్ రాకపోవడం పట్ల ఆయన టెన్షన్ పడుతున్నారని విన్నాను. ఆ తరువాత ఆయన అదే పనిపై కూర్చుని తనకి సంతృప్తిని కలిగించేలా అవుట్ పుట్ రాబట్టగలిగారు. ఆయన పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధిస్తుంది" అని చెప్పుకొచ్చారు.         

rajanikanth
akshay kumar
  • Loading...

More Telugu News