Narendra Modi: తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్నా: తెలుగులో ట్వీట్ చేసిన నరేంద్ర మోదీ

  • నేడు ప్రధాని తెలంగాణ పర్యటన
  • రెండు ప్రచార సభల్లో ప్రసంగించనున్న మోదీ
  • ఆసక్తితో ఎదురుచూస్తున్నానని ట్విట్టర్ లో వెల్లడి

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా, నేడు ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో జరిగే బీజేపీ బహిరంగ సభలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తెలుగులో ఓ ట్వీట్ పెట్టారు.

 "నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా, ఎదురు చూస్తున్నాను. మొదటగా నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్ నగర్ లో మీతో నా భావాలు పంచుకొంటాను" అని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, నేడు నాందేడ్ పర్యటన అనంతరం, అక్కడి నుంచి నేరుగా మోదీ నిజామాబాద్ చేరుకోనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ఆయన, ఆపై అదే హెలికాప్టర్ లో నేరుగా మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.



Narendra Modi
Telangana
Campaign
Nizamabad District
Mahabubnagar
BJP
  • Loading...

More Telugu News