KCR: నేను బతికుండగా ఇదొక్కటి జరిగితే చాలు: కేసీఆర్

  • అసెంబ్లీ ఎన్నికలకు మిగిలింది 10 రోజులే
  • మూడు జిల్లాలను చుట్టి వచ్చిన కేసీఆర్
  • కాళేశ్వరం నీరు తెచ్చి రైతుల కాళ్లు కడుగుతా
  • ప్రతి తెలంగాణ బిడ్డా ఆత్మగౌరవాన్ని చాటాలన్న కేసీఆర్

ప్రతి రైతూ ధనవంతుడు కావాలన్నదే తన చిరకాల కోరికని, అది తాను బతికుండగానే జరగాలని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరొక్క పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో సుడిగాలి పర్యటనలు చేస్తూ, నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు కేసీఆర్. నిన్న ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన ఆయన, రైతులకు మరింత లబ్ధి కలగాలంటే, తెరాస తిరిగి అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు.

కాళేశ్వరం నీళ్లను తెచ్చి అన్నదాతల కాళ్లు కడుగుతానని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 19.83 శాతం ప్రగతి గణాంకాలను నమోదు చేసిందని, ఆంధ్రప్రదేశ్ కన్నా ఇది ఎక్కువని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రానుందని చెప్పారు. రాష్ట్రంలో విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నందునే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్న ఆయన, ప్రతి తెలంగాణ బిడ్డా ఆత్మ గౌరవ జెండాను ఎగురవేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.

KCR
Telangana
Elections
Farmer
Kaleshwaram
  • Error fetching data: Network response was not ok

More Telugu News