Anil Ambani: రాఫెల్ ఒప్పందంపై వరుస కథనాలు.. ‘ద వైర్’పై రూ. 6 వేల కోట్లకు రిలయన్స్ పరువునష్టం దావా

  • రాఫెల్ డీల్‌పై వరుస కథనాలు
  • కోర్టుకెక్కిన అనిల్ అంబానీ గ్రూప్
  • ప్రశ్నించిన ప్రతిసారీ ఇలాంటివి మామూలేనన్న ‘ద వైర్’

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ వరుస కథనాలు ప్రచురిస్తున్న న్యూస్ పోర్టల్ ‘ద వైర్’పై రిలయన్స్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. తమ పరువుకు నష్టం వాటిల్లేలా కథనాలు ప్రచురిస్తోందంటూ ‘ద వైర్’పై రూ. 6 వేల కోట్లకు పరువునష్టం దావా వేసింది. కథనాలపై అనిల్ అంబానీ గ్రూప్ కోర్టుకెక్కడంపై ‘ద వైర్’ స్పందించింది.

రాఫెల్ ఒప్పందంలోని పారదర్శకతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారి తమకు అదానీ, అంబానీ వంటి వారి నుంచి ఇటువంటి లీగల్ నోటీసులు అందుతూనే ఉన్నాయని సంస్థ వ్యవస్థాపకుడు ఎంకే వేణు పేర్కొన్నారు. తమను వేధించేందుకే దావాలు వేస్తున్నారన్న ఆయన తాము ఏ సంస్థనూ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. కొన్ని సంస్థలపైనే ఎందుకంత ఉదారంగా వ్యవహరిస్తున్నారని మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు వేణు తెలిపారు.

Anil Ambani
Reliance
Rafale jets
The wire
Narendra Modi
  • Loading...

More Telugu News