Nandamuri suhasini: సుహాసిని రాకతో ఒక్కటైన ఎన్టీఆర్ కుటుంబం.. ఆనందోత్సాహాల్లో టీడీపీ శ్రేణులు

  • సుహాసినిని ఒప్పించిన భువనేశ్వరి
  • ప్రచారానికి రానున్న బాలయ్య
  • సోదరి కోసం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న

ప్రజాకూటమి అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసిని బరిలోకి దిగిన తర్వాత ఇటు రాజకీయ పరిణామాలే కాక, అటు నందమూరి కుటుంబంలోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ఎడ మొహం పెడమొహంగా ఉన్న నందమూరి కుటుంబాలు ఇప్పుడు సుహాసిని కారణంగా మళ్లీ ఒక్క చోటుకి చేరుతున్నాయి. 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఇప్పుడు టీడీపీ తరపున సుహాసినికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నాడు. అలాగే, కల్యాణ్‌రామ్ కూడా అక్కకు మద్దతుగా ప్రచారానికి రానున్నాడు. మరోపక్క, బాలకృష్ణ ప్రచారానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కూకట్‌పల్లి నుంచి తొలుత కల్యాణ్ రామ్‌ను బరిలోకి దింపాలని టీడీపీ భావించింది. అయితే, అందుకు అతడు నిరాకరించడంతో అకస్మాత్తుగా సుహాసినిని తెరపైకి తెచ్చారు. ఆమెతో మంచి సంబంధాలున్న చంద్రబాబు భార్య భువనేశ్వరి మాట్లాడి సుహాసినిని పోటీకి ఒప్పించారు. సుహాసిని నామినేషన్ రోజున బాలయ్య తోడుగా వెళ్లారు. సోదరిని గెలిపించుకుంటామని ఎన్టీఆర్, తారకరత్న, కల్యాణ్ రామ్ ఇప్పటికే ప్రకటించారు. సుహాసిని కారణంగా నందమూరి కుటుంబం ఒక్కటి కావడం ఎన్టీఆర్, టీడీపీ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం నింపింది.

Nandamuri suhasini
Telugudesam
Harikrishna
NTR
Kalyan Ram
Balakrishna
  • Loading...

More Telugu News