bandla ganesh: బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలి: నటుడు పృథ్వి సెటైర్

  • గణేష్ రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది
  • మహాకూటమి గెలిస్తే.. అమరావతి నుంచి పాలన ఉంటుంది
  • కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఐదారు సీట్లు మాత్రమే వచ్చేవి

కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ పై నటుడు పృథ్వి సెటైర్లు వేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గణేష్ చాలా విచిత్రంగా ప్రవర్తించారని చెప్పారు. ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోతే బ్లేడుతో మెడ కోసుకుంటానని చెప్పారని... ఆయనను కాపాడాలని పోలీసులకు చెప్పాలని, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలని ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడితో కూడా గణేష్ ఫొటో దిగే శక్తి ఉన్నోడని, తనకు అంత శక్తి లేదని అన్నారు. అయితే గణేష్ మంచి నిర్మాత అని, తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.

కేసీఆర్ మగాడని, విజయమే లక్ష్యంగా ఆయన ప్రయాణం ఉందని పృథ్వి చెప్పారు. అధికారం కోసమే మహాకూటమి ఏర్పడిందని... కేసీఆర్ కు అలాంటి అనైతిక కలయికలు లేవని అన్నారు. తెలంగాణలో మహాకూటమికి ఓటు వేస్తే... పరిపాలన అమరావతి నుంచి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే కేవలం ఐదారు సీట్లు మాత్రమే వచ్చేవని అన్నారు. 

bandla ganesh
pruthvi
congress
mahakutami
tollywood
  • Loading...

More Telugu News