nandamuri suhasini: సుహాసినికి మద్దతుగా ప్రచారం చేయనున్న పరిటాల సునీత... డిసెంబర్ తొలి వారంలో బాలయ్య, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

  • రేపు, ఎల్లుండి ప్రచారం నిర్వహించనున్న పరిటాల సునీత
  • 28, 29 తేదీల్లో రాహుల్, చంద్రబాబుల బహిరంగసభలు
  • సుహాసినికి మద్దతు ప్రకటించిన పలువురు సినీ నటులు

కూకట్ పల్లి నియోజకవర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన నందమూరి సుహాసిని తరపున ఆయన కుటుంబసభ్యులు రంగంలోకి దిగనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు, రేపు, ఎల్లుండి సుహాసినితో కలసి ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారాన్ని చేపట్టబోతున్నారు. 28, 29 తేదీల్లో రాహుల్ గాంధీతో కలసి బహిరంగసభల్లో పాల్గొనడానికి చంద్రబాబు వస్తున్నారు. ఈ వివరాలను టీటీడీపీ నేత పెద్దిరెడ్డి తెలియజేశారు. కాగా, సినీ నటుడు జగపతిబాబు సహా పలువురు నటులు ఇప్పటికే సుహాసినికి తమ మద్దతును తెలియజేశారు.

nandamuri suhasini
paritala sunitha
Balakrishna
ntr
kalyan ram
Chandrababu
Rahul Gandhi
peddireddy
kukatpalli
Telugudesam
  • Loading...

More Telugu News