Sonia Gandhi: సోనియా కాళ్లు మొక్కి.. కాపలా కుక్కలా ఉంటానని చెప్పారు: కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

  • గద్దెనెక్కుతూనే ప్రజలను కేసీఆర్ మోసం చేశారు
  • సోనియా, రాహుల్ గురించి మాట్లాడే అర్హత కూడా కేసీఆర్ కు లేదు
  • కాంగ్రెస్ మేనిఫెస్టోను సిగ్గులేకుండా కాపీ కొట్టారు

ఎంతో కష్టపడి తెలంగాణను సాధించుకున్నామని... కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గద్దెనెక్కుతూనే ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.  బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్... రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పారని... ఆ తర్వాత మాట మార్చారని అన్నారు.

అధికార దాహంతోనే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ చేపట్టారని దుయ్యబట్టారు. సోనియా, రాహుల్ గురించి మాట్లాడే అర్హత కూడా కేసీఆర్ కు లేదని అన్నారు. తమకు పిల్లలు లేరని... తెలంగాణ ప్రజలే తమకు పిల్లలని ఉత్తమ్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించడం ఖాయమని... ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు పోవడం ఖాయమని అన్నారు.

ఒక పైలట్ గా ప్రాణాలను ఒడ్డి దేశ రక్షణ కోసం పోరాడిన చరిత్ర తనదని... అలాంటి తనపై కేసీఆర్, కేటీఆర్ లు నోటికొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సిగ్గులేకుండా కాపీ కొట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ దొంగ జపాన్ని తాము ఎప్పుడో బయటపెట్టామని చెప్పారు. తెలంగాణకు ఏమీ చేయలేకపోయిన కేసీఆర్... ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. 

Sonia Gandhi
Rahul Gandhi
kcr
congress
TRS
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News