kcr: ఎవరూ ప్రచారం నిర్వహించవద్దు.. ప్రజలు కేసీఆర్ కు ఓటు వేస్తారో.. నాకు ఓటు వేస్తారో చూద్దాం: వంటేరు

  • ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ నెరవేర్చలేదు
  • గద్వాల్ కు కేసీఆర్ చేసింది ఏమిటి?
  • నా అనుచరులను పోలీసులు వేధిస్తున్నారు

గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ నెరవేర్చలేదని గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. గజ్వేల్ లో మహాకూటమి కార్యకర్తలు ఎవరూ ప్రచారం నిర్వహించవద్దని... ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో చూద్దామని అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తన అనుచరులపై సివిల్ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌస్ లో పోలీసులు ఎందుకు సోదాలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. 

kcr
jagwel
vanteru pratap reddy
  • Loading...

More Telugu News