uma bharathi: రామమందిర నిర్మాణానికి అసదుద్దీన్ ఓవైసీ, అజాం ఖాన్‌ లతో పాటు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి: ఉమా భారతి

  • ఉద్ధవ్ థాకరే డిమాండ్ ని అభినందించిన కేంద్రమంత్రి 
  • రామ మందిర నిర్మాణం బీజేపీ హక్కు కాదు, అది దేశ ప్రజలందరీ హక్కు
  • రామ మందిర నిర్మాణం కోసం సహకరించాలని వినతి

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ తో విశ్వహిందూ పరిషత్, శివసేనలు ధర్మసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. రామ మందిరం నిర్మించాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేయడాన్ని కేంద్రమంత్రి ఉమా భారతి అభినందించారు. రామ మందిర నిర్మాణం బీజేపీ హక్కు కాదు, అది దేశ ప్రజలందరి హక్కు అని ఆమె తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, అకాలీదళ్, అసదుద్దీన్ ఓవైసీ, అజాం ఖాన్‌ లతో పాటు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రామ మందిర నిర్మాణం కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

uma bharathi
shivsena
BJP
Uttar Pradesh
ram mandir
ayodhya
  • Loading...

More Telugu News