cpi ramakrishna: ప్రజాస్వామ్యం అంటూ దేశమంతా తిరిగే చంద్రబాబుకు చింతమనేని ఆగడాలు కనిపించడం లేదా?: సీపీఐ రామకృష్ణ

  • ఎమ్మెల్యే ప్రభాకర్‌ను తక్షణం అరెస్టు చేయాలంటూ బాబుకు లేఖ
  • అట్రాసిటీ కేసు నమోదై రెండు నెలలైనా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్న
  • ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమండ్

'ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఇది' అంటూ దేశమంతా తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలో తన పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆగడాలు కనిపించడం లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు చట్టం పనిచేస్తోందా? లేదా? అన్నారు.

ఎమ్మెల్యే చింతమనేనిని తక్షణం అరెస్టు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎంకు రామకృష్ణ లేఖ రాశారు. చింతమనేనిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై రెండు నెలలవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విజిలెన్స్‌, మీడియా, రెవెన్యూ, ఫారెస్టు అధికారులపై దాడులకు పాల్పడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలోని ఉద్దేశం ఏమిటన్నారు. ఇప్పటికైనా సీఎం, తన ఎమ్మెల్యే ఆగడాలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

cpi ramakrishna
Chinthamaneni Prabhakar
Chandrababu
  • Loading...

More Telugu News