jairamramesh: మతం పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య: మాజీ మంత్రి జైరాంరమేష్
- ఉత్తర ప్రదేశ్‌లో ఇదే ఎత్తుగడతో అధికారం చేజిక్కించుకుంది
- ఇప్పుడు చత్తిస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది
- బీజేపీలో ఒకరే అమిత్ షా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌లో పది మంది ఉన్నారు
ఎన్నికల్లో గెలవడానికి మతపరమైన ఎజెండాను అమలు చేయడం భారతీయ జనతా పార్టీకి వెన్నతోపెట్టిన విద్య అని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. మతపరంగా విడదీసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం భాజపా మొదటి నుంచి అనుసరిస్తున్న విధానమని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ ఎత్తుగడతోనే అధికారం చేజిక్కించుకుందని, తాజాగా చత్తిస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఇటువంటి వ్యూహాలు అమలు చేయడానికి బీజేపీలో ఒకే అమిత్ షా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌లో పది మంది అమిత్‌షాలు ఉన్నారని చెప్పారు.