Mahesh Babu: అభిమానిగా 106 యేళ్ల వృద్ధురాలు .. ఆమె ప్రేమకు పొంగిపోయిన మహేశ్ బాబు

  • మహేశ్ బాబుకి యూత్ లో విపరీతమైన క్రేజ్ 
  • ఆయన అభిమానిగా రేలంగి సత్యవతి 
  • ఆమె నుంచి ఆశీస్సులు అందుకున్న మహేశ్

సాధారణంగా ఈ తరం కుర్రకారు ఈ తరం హీరోలను ఎక్కువగా అభిమానిస్తుంటారు .. వాళ్ల సినిమాలనే ఎక్కువగా చూస్తుంటారు. ఇక బాగా వెనక్కి వెళితే ఎన్టీ రామారావును .. అక్కినేని నాగేశ్వరరావును ఎక్కువగా అభిమానించే వాళ్లు కనిపిస్తారు. ఆ కాలం నాటి వాళ్లు ఈ తరం హీరోలను అభిమానించడమనేది అరుదుగా కనిపిస్తుంది. కానీ ఆ వయసు వారిని కూడా తన అభిమానులుగా చేసుకున్న ఘనత మహేశ్ బాబుకి దక్కింది. రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి అనే 106 యేళ్ల వృద్ధురాలికి మహేశ్ బాబు అంటే ఎంతో అభిమానం. మహేశ్ బాబును చూడాలనేది ఆమె కోరిక. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకున్న మహేశ్ బాబు ఆమెను కలుసుకున్నాడు. ఆప్యాయంగా ఆమె అక్కున చేరిపోవడమే కాకుండా, ఆమె నుంచి ఆశీస్సులు అందుకున్నాడు. ఆమె ప్రేమాభిమానాలు తనకి ఎంతో ఆనందాన్ని కలిగించాయని చెప్పాడు. ఇది తన కెరియర్లో తాను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.    

  • Loading...

More Telugu News