Virat Kohli: సిక్సర్ కొట్టిన కోహ్లీ.. బౌండరీలో క్యాచ్ పట్టిన సెక్యూరిటీ గార్డు

  • భారత్-ఆసీస్ మధ్య మూడో టీ20
  • మ్యాక్స్‌వెల్ వేసిన బంతిని సిక్సర్ కొట్టిన కోహ్లీ
  • అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న సెక్యూరిటీ గార్డు

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టీ20లో ఓ సెక్యూరిటీ గార్డు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది.

 ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. 17వ ఓవర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన బంతిని విరాట్ మిడ్ వికెట్ మీదుగా బలంగా బాదాడు. బౌండరీ లైన్‌కు ఆవల ఉన్న సెక్యూరిటీ గార్డు బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. ఇది చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో అతడిని అభినందించారు. కోహ్లీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకున్న సెక్యూరిటీ గార్డు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.

Virat Kohli
Cricket
Team india
Australia
Sydney
Security Gaurd
  • Loading...

More Telugu News