mohan bhagawath: అయోధ్య కేసు ఆలస్యం జరిగితే న్యాయానికి అన్యాయం జరిగినట్టే!: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

  • అక్కడ ఆలయం ఉన్నట్టు ఇప్పటికే రుజువైంది
  • ఇప్పటికైనా సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని త్వరగా వెల్లడించాలి
  • సుప్రీంకోర్టు పట్టించుకోకపోవడం బాధాకరం

అయోధ్య రామ మందిరం కేసుకు సుప్రీంకోర్టు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్కడ ఆలయం ఉన్నట్టు రుజువైందని... అయితే, సుప్రీంకోర్టు పట్టించుకోకపోవడం బాధాకరమని చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీరు సరైంది కాదని అన్నారు. ఆలస్యం జరిగితే... న్యాయానికి అన్యాయం జరిగినట్టేనని చెప్పారు. ఇప్పటికైనా ఈ కేసు విషయంలో తుది నిర్ణయాన్ని త్వరగా వెల్లడించాలని కోరారు. అయోధ్యలో జరుగుతున్న ధర్మసభకు మద్దతుగా దేశంలోని పలు పట్టణాల్లో హిందూ సంస్థలు సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా నాగపూర్ లో హుంకార్ సభను నిర్వహించారు. ఈ సభలో ప్రసంగిస్తూ, మోహన్ భగవత్ పైవ్యాఖ్యలు చేశారు. 

mohan bhagawath
rss
ayodhya
Supreme Court
  • Loading...

More Telugu News