konda visweswara reddy: కేకే, జితేందర్ రెడ్డిలు కూడా టీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారు: కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • టీఆర్ఎస్ లో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు
  • నేను వేసుకునే దుస్తులపై కూడా కేసీఆర్ కామెంట్ చేసేవాడు
  • కొత్తగా చేరినవారికే పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు

టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని...  కేశవరావు, జితేందర్ రెడ్డిలాంటి సీనియర్ నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని వారంతా మాట్లాడుకుంటూ ఉంటారని అన్నారు. ఒకప్పుడు జై తెలంగాణ అన్న నేతలంతా... ఇప్పుడు జై కేసీఆర్, జై కేటీఆర్ అంటున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ లో తన ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని కొండా తెలిపారు. తాను వేసుకునే దుస్తులపై కూడా కేసీఆర్ కామెంట్ చేసేవాడని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో పని చేసిన వారికి పార్టీలో ప్రాధాన్యత లేదని... కొత్తగా చేరినవారికే పెద్ద పీట వేస్తున్నారని విమర్శించారు.

konda visweswara reddy
keshava rao
jitender reddy
kcr
KTR
TRS
congress
  • Loading...

More Telugu News