jaffer sharief: కేంద్ర మాజీ మంత్రి జాఫర్ షరీఫ్ కన్నుమూత
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-9f5678d9bb73d7da45ad5489fbf206178c285dec.jpg)
- బెంగళూరులో కన్నుమూసిన జాఫర్ షరీఫ్
- ఆయన వయసు 85 సంవత్సరాలు
- శుక్రవారంనాడు కారు ఎక్కుతూ కుప్పకూలిన షరీఫ్
కేంద్ర మాజీ రైల్వే మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జాఫర్ షరీఫ్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. శుక్రవారం కారు ఎక్కుతూ ఆయన కుప్పకూలిపోయారు. దీంతో, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. బెంగళూరులోని ఫోర్టిస్ ఆసుపత్రి ఐసీయూలో ఉంచి, చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. రెండేళ్ల క్రితమే ఛాతీలో అసౌకర్యంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. దీంతో, ఆయనను పరీక్షించిన వైద్యులు పేస్ మేకర్ అమర్చుకోవాలని సూచించారు. మరోవైపు, జాఫర్ షరీఫ్ మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.