amit shah: హిందూ దేవతలను అక్బరుద్దీన్ అవమానించినా.. కేసీఆర్ ఏం చేయలేకపోయారు: అమిత్ షా

  • విమోచన దినాన్ని కూడా అధికారికంగా నిర్వహించలేదు
  • ఎంఐఎంను చూసి కేసీఆర్ భయపడుతున్నారు
  • బీజేపీకి అధికారం ఇస్తే.. అధికారం అంటే ఏమిటో చేసి చూపిస్తాం

ఎంఐఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడతున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. విమోచన దినం సెప్టెంబర్ 17ను టీఆర్ఎస్ అధికారికంగా నిర్వహించలేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ మాత్రమే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. హిందూ దేవతలను ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారని... కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. తెలంగాణలో ఎంఐఎంను ఎదుర్కోగల ఏకైక పార్టీ బీజేపీనే అని చెప్పారు. నిర్మల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ఏమీ లేదని... ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని అమిత్ షా అన్నారు. గతంలో నిర్మల్ లో ఎన్నో పరిశ్రమలు ఉండేవని... ఇప్పుడు అన్నీ మూత పడ్డాయని చెప్పారు. ఈ పరిశ్రమలు మూతపడటానికి కారణం ఎవరో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమైనవని... రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయని చెప్పారు. 

amit shah
kcr
mim
TRS
bjp
Akbaruddin Owaisi
nirmal
  • Loading...

More Telugu News