rx100 movie: ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ కు బంపర్ ఆఫర్!

  • శరవేగంగా సాగుతున్న బయోపిక్ షూటింగ్
  • ఇప్పటికే ఖరారైన ప్రధాన పాత్రధారులు
  • జనవరి 9న రిలీజ్ కు నిర్మాతల ఏర్పాట్లు

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో పాయల్ రాజ్ పుత్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత పాయల్ కు పలు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. తాజాగా ఈ అమ్మడికి క్రేజీ ప్రాజెక్టు దక్కినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో పాయల్ కు ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ, శ్రీదేవి, తదితరుల పాత్రలకు నటులు ఇప్పటికే ఖరారయ్యారు.

తాజాగా సహజ నటి జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్ ను తీసుకోవాలని క్రిష్ యోచిస్తున్నట్లు సమాచారం. పాయల్ ముఖకవళికలు, హావభావాలు జయసుధకు సరిగ్గా సరిపోతాయని భావించిన సినిమా నిర్మాతలు, దర్శకుడు పాయల్ ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ లో గతంలో డ్రైవర్‌ రాముడు’, ‘గజదొంగ’, ‘మహా పురుషుడు’, ‘అడవి రాముడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన ‘కథానాయకుడు’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేసేందుకు నిర్మాతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

rx100 movie
payal rajput
Balakrishna
ntr biopic
offer
  • Loading...

More Telugu News