Andhra Pradesh: విమానాల విన్యాసాలు చూస్తుంటే నాకు పైలెట్ కావాలని అనిపిస్తోంది!: సీఎం చంద్రబాబు

  • అమరావతిని టాప్-5 నగరంగా నిలబెడతాం
  • ఎయిర్ షో అద్భుతంగా సాగింది
  • ఏపీలో నైపుణ్యమున్న యువత అధికంగా ఉంది

అమరావతి ఎయిర్ షో-2018 అద్భుతంగా సాగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. విమానాల విన్యాసాలను చూస్తుంటే తనకు పైలెట్ కావాలని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. దేశంలోనే నైపుణ్యమున్న యువత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

అమరావతి ఎయిర్ షో-2018 ముగింపు వేడుకల సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అమరావతిని ప్రపంచంలోనే 5 అతి సుందరమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. ప్రపంచంలో ప్రజలు ఆనందంగా జీవించేందుకు అద్భుతమైన నగరంగా అమరావతిని నిర్మిస్తామని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పర్యాటకం, సూక్ష్మసేద్యం, ఆర్గానిక్, జీరో వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు.

Andhra Pradesh
amaravati air show
Chandrababu
pilot
wish
  • Loading...

More Telugu News