BJP: అయ్యో! మళ్లీ జారిపడిన అమిత్ షా.. ఈసారి మధ్యప్రదేశ్‌లో..!

  • మొన్న మిజోరంలో హెలికాప్టర్ దిగుతూ..
  • శనివారం ప్రచార వేదిక వద్ద
  • తాను బాగానే ఉన్నానన్న షా

బీజేపీ చీఫ్ అమిత్ షా మరోమారు జారిపడ్డారు. మొన్న మిజోరంలో హెలికాప్టర్ దిగుతూ జారిపడిన ఆయన ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో మరోమారు జారిపడ్డారు. అయితే, పక్కనే ఉన్న నేతలు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై పట్టుకుని పైకి లేపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.

గురువారం అమిత్ షా మిజోరం పర్యటనకు వెళ్లారు. హెలికాప్టర్ మెట్లు దిగుతుండగా జారిపడ్డారు. అయితే, ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ  ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం కోసం వెళ్లిన అమిత్‌ షా మరో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అశోక్ నగర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రసంగం అనంతరం వేదిక దిగుతుండగా కిందపడ్డారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పైకి లేపారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని, బాగానే ఉన్నానని అమిత్ షా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడీ వీడియోకు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం లభిస్తోంది. ఈ నెల 28న మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సోమవారంతో ప్రచారం ముగియనుంది.

BJP
Madhya Pradesh
Amit Shah
Mizoram
  • Error fetching data: Network response was not ok

More Telugu News