Amarish: ప్రాణ మిత్రుడిని కోల్పోయా.. అంబరీష్ మృతిపై రజనీకాంత్

  • అంబరీష్‌ను మిస్సవుతున్నా: రజనీకాంత్
  • మనసున్న వ్యక్తిని కోల్పోయా: సిద్ధరామయ్య
  • ఆ సేవలు గుర్తుండిపోతాయి: రమ్య

ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ సీనియర్ నేత అంబరీష్ (66) మృతి విషయం తెలిసి తమిళ నటుడు రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రాణ మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. అంబరీష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.  

పార్టీ నేత అంబరీష్ మృతికి కాంగ్రెస్ పార్టీ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సంతాపం తెలిపారు. అంబరీష్ గొప్ప నటుడు మాత్రమే కాదని, గొప్ప రాజకీయ నేత కూడా అని పేర్కొన్నారు. అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామని ఆవేదన  వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను ఎంతగానో బాధించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అంబరీష్ ఇక లేరని తెలిసి చాలా బాధపడ్డానని కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య పేర్కొన్నారు. పార్టీకి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆయన లేరన్న విషయం తెలిసి షాక్‌కు గురయ్యామని, ఆయన కుటుంబానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అలాగే, పలువురు నటీనటులు కూడా అంబరీష్ మృతికి సంతాపం తెలిపారు. కాగా, గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అంబరీష్ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రాత్రి కన్నుమూశారు.

Amarish
Congress
Bangaluru
Rajinikanth
Ramya
sidda Ramaiah
  • Error fetching data: Network response was not ok

More Telugu News