bandla ganesh: తెలంగాణకు కాబోయే సీఎం ఎవరో చెప్పిన బండ్ల గణేశ్

  • కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఉత్తమ్ ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి
  • ప్రజలను కేసీఆర్ కుటుంబం అన్ని విధాలా మోసం చేసింది

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి ఎవరో కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ జోస్యం చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే సీఎం అని ఆయన అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో బండ్ల గణేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీని విభజిస్తే కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని తెలిసినా... తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ కుటుంబం అన్ని విధాలా మోసం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

bandla ganesh
Uttam Kumar Reddy
Chief Minister
Telangana
TRS
congress
  • Loading...

More Telugu News