manda krishna: మాదిగల సంపూర్ణ మద్దతు మహాకూటమికే: మంద కృష్ణ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-67a1bf8e601439731ac6ac10e6c89b3d063f382d.jpg)
- మహాకూటమి విజయానికి కృషి చేస్తాం
- మాదిగలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలి
- ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలి
కేసీఆర్ నిరంకుశ పాలనను పారదోలేందుకు మహాకూటమికి మాదిగల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ తెలిపారు. మాదిగల మద్దతు కావాలని కాంగ్రెస్ కోరిందని... భాగస్వామ్యపక్షాలతో కలసి కూటమి విజయానికి కృషి చేస్తామని చెప్పారు.
మరోవైపు, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మహాకూటమి మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే మాదిగలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని కోరారు. ఆయన డిమాండ్లకు కూటమి నేతలు సానుకూలంగా స్పందించడంతో... మహాకూటమికి ఆయన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.