kcr: కేసీఆర్ ప్రతి రోజు మనల్నే తిడతారు.. ఎందుకు తిడతారో అర్థంకాదు: చంద్రబాబు

  • హైదరాబాదు నగరాన్ని ఇచ్చినా పాలించడం చేత కాలేదు
  • మోదీతో లాలూచి పడే నన్ను విమర్శిస్తున్నారు
  • పరిశ్రమల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి

ప్రధాని మోదీతో కుమ్మక్కైన కొందరు రాజకీయ నాయకులు టీడీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణలో మహాకూటమిలో చేరామని చెప్పారు. అనంతపురంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కు తనను విమర్శించే హక్కు లేదని అన్నారు. ఒక గొప్ప హైదరాబాద్ నగరాన్ని ఇచ్చినా... సరిగా పాలించడం చేతకానివారికి తనను విమర్శించే హక్కు ఎక్కడుందని చంద్రబాబు ప్రశ్నించారు. మోదీతో లాలూచి పడటం వల్లే కేసీఆర్ తనను విమర్శిస్తున్నారని అన్నారు.

ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాదును తెలంగాణకు ఇచ్చామని.. ఏపీ ఆదాయం తక్కువగా ఉందని, అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము కట్టుబడ్డామని నిన్న సోనియాగాంధీ చెప్పారని చంద్రబాబు అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో వివిధ సంస్థలతో రూ. 16 లక్షల కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. పరిశ్రమల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. నైపుణ్య శిక్షణ, సులభతర వాణిజ్యంలలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని చెప్పిన ఏకైక రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. 

  • Loading...

More Telugu News