mary kom: చరిత్ర సృష్టించిన మేరీకోమ్.. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ షిప్

  • ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న మేరీకోమ్
  • ఆరు స్వర్ణ పతకాలు సాధించిన తొలి మహిళగా ఘనత
  • హన్నా ఒకోటాను 5-0తో చిత్తు చేసిన మేరీ

భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ చరిత్రపుటల్లోకి ఎక్కింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆరో స్వర్ణాన్ని సొంతం చేసుకుని, ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో... ఉక్రెయిన్ బాక్సర్ హన్నా ఒకోటాపై మేరీకోమ్ ఘన విజయం సాధించింది.

48 కిలోల విభాగంలో 5-0తో ఒకోటాను కంగుతినిపించింది. ఈ టోర్నీ ముందు వరకు ఐదు స్వర్ణ పతకాలతో ఐర్లండ్ బాక్సింగ్ దిగ్గజం టేలర్ తో సమానంగా మేరీకోమ్ ఉంది. ఈనాటి స్వర్ణంతో ఆరు స్వర్ణాలు సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. ఆమె ఖాతాలో ఒక సిల్వర్ మెడల్ కూడా ఉండటం గమనార్హం. దీన్ని కూడా కలుపుకుంటే... ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆమె సాధించిన పతకాల సంఖ్య 7కు చేరుతుంది.

  • Loading...

More Telugu News