Andhra Pradesh: జగన్ కోడికత్తి డ్రామా చేస్తుంటే.. పవన్ ఇసుక లారీల డ్రామా ఆడుతున్నారు!: పంచుమర్తి అనురాధ

  • చంద్రబాబునే మీరు విమర్శిస్తారా?
  • పవన్ కు టీడీపీ శ్రేణులు బుద్ధి చెబుతాయి
  • జనసేనానిపై మండిపడ్డ టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం దారుణమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. చంద్రబాబును విమర్శించడానికి పవన్ కు ఉన్న అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. చంద్రబాబు గురించి వెటకారంగా మాట్లాడితే టీడీపీ శ్రేణులు సహించబోవని హెచ్చరించారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అనురాధ మాట్లాడారు.

దారిన వెళుతున్న ఇసుక లారీని ఢీకొట్టిన పవన్ కల్యాణ్.. తనపై ఇసుక లారీతో దాడి జరిగిందని హాహాకారాలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కోడికత్తి డ్రామాలు ఆడుతుంటే, జనసేనాని ఇసుక లారీల డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలనే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై చేయాలని పవన్ కు ఆమె సవాలు విసిరారు. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే టీడీపీ కార్యకర్తలు గట్టిగా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Vijayawada
Jagan
Pawan Kalyan
Chandrababu
Telugudesam
panchumarti anuradha
  • Loading...

More Telugu News