amit shah: హెలికాప్టర్ నుంచి దిగబోతూ.. కిందపడ్డ అమిత్ షా

  • గురువారం చోటుచేసుకున్న ఘటన
  • మిజోరాం ఎన్నికల ప్రచారంలో ప్రమాదం
  • 28న మిజోరాం అసెంబ్లీకి ఎన్నికలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పొరపాటున కాలు జారి హెలికాప్టర్ నుంచి కింద పడ్డారు. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే, మిజోరాం ఎన్నికల ప్రచారం సందర్భంగా వెస్ట్ తుయ్ పూర్ నియోజకవర్గంలోని త్లబంగ్ గ్రామానికి ఆయన హెలికాప్టర్ లో వెళ్లారు.

హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత దిగబోయిన ఆయన పొరపాటున అడుగు తప్పుగా వేయడంతో నేలపై పడ్డారు. వెంటనే హెలికాప్టర్ లో ఆయనతో పాటే వెళ్లిన మరో వ్యక్తి ఆయనను పైకి లేపారు. దుస్తులకు అంటుకున్న దుమ్మును దులిపారు. ఘటన నుంచి తేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి తన కార్యక్రమానికి బయలుదేరారు. మిజోరాంలో ఈనెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోను ఎవరో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో... ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

amit shah
bjp
helicopter
slip
  • Loading...

More Telugu News